ఆక‌ట్టుకుంటున్న 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' ట్రైల‌ర్ ‌

Solo Brathuke So Better Trailer. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం

By Medi Samrat  Published on  19 Dec 2020 7:14 AM GMT
ఆక‌ట్టుకుంటున్న సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ ట్రైల‌ర్ ‌

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సుబ్బు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూర్చారు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు మ‌రియు సాంగ్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర టైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్‌లో ఏం ఉందంటే.. మాకు న్యాయం జరగాలి అంటూ కొంత మంది యువతీ యువకులు ధర్నా చేస్తూ సాయి ధరమ్ తేజ్ కటౌట్ ని తగలబెడుతున్నారు. అసలు వీడెవడు? ఏమి చేసుంటాడు? ఖర్చు పెట్టి మరీ వీడి కటౌట్ ను ఎందుకు తగలబెడుతున్నారు? ఇదంతా తెలియాలంటే మీరు ఈ కథలోకి రావాలి అంటూ విరాట్ పాత్రధారి అయిన సాయి తేజ్ చెప్తున్నాడు. మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా బ్రతకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్ షిప్స్ తో నాశనం చేస్తున్నాం అని విరాట్ చెప్పడం ద్వారా ఈ సినిమా నేపథ్యం అర్థం అవుతోంది. సినిమా హాళ్ళలో మందుకి సిగరెట్లకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినట్లే.. అలానే పెళ్లి కి పెళ్ళానికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలి అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ న‌వ్వులు పూయిస్తుంది. గ‌త ఏడాది 'ప్ర‌తిరోజు పండుగే' చిత్రం మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్.. ప్ర‌స్తుతం 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' చిత్రంతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయం అని అనిపిస్తుంది.Next Story
Share it