'ప్రతిరోజు పండగే' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఆ మూవీ ఇచ్చిన జోష్‌లో ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తేజు సరసన నబా నటేష్ నటిస్తోంది. శ్రీ వెంటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను సాంగ్ ను విడుదల చేశారు.
'బోలో బోలో బ్యాచ్‌లర్.. సోలో బ్రతుకే సో బెటర్' అనే పాటను విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటకు థమన్ సంగీతాన్ని అందించగా.. విశాల్ పాడాడు. ''సాటి సోలో సోదరసోదరియమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే…Solo Brathuke So Better! మన సింగిల్స్ అందరికి అంకితం!'' అంటూ తేజ్ ట్వీట్ చేశాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న 'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ కానుంది.