ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో చెప్పిన శోభితా ధూళిపాళ్ల..!

Sobhita Dhulipala on her ideal man He should be grounded and close to the earth. శోభితా ధూళిపాళ్ల.. అచ్చ తెలుగమ్మాయే..! కానీ అమ్మడు పలు భాషల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని

By Medi Samrat
Published on : 21 Jun 2023 7:00 PM IST

ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో చెప్పిన శోభితా ధూళిపాళ్ల..!

శోభితా ధూళిపాళ్ల.. అచ్చ తెలుగమ్మాయే..! కానీ అమ్మడు పలు భాషల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఈ మధ్య అమ్మడు నాగ చైతన్యతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కూడా కథనాలు వచ్చాయి. వాటిని అధికారికంగా ధృవీకరించలేదనుకోండి. తాజాగా శోభితా తన రిలేషన్ షిప్ గురించి మీడియాతో మాట్లాడింది. తన వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలను తాను పట్టించుకోనని.. అసలు ఏముందని బాధ పడడానికి? అంటూ ప్రశ్నించింది.

నేను ఇది చెప్పకపోతే దీనిపై ప్రజలు తెలుసుకోవడానికి అవకాశమే ఉండదు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ప్రతి దశలోనూ ఎంతో కష్టపడ్డాను. మీరు నన్ను చూడాలనుకుంటే, లేదా నా గురించి తెలుసుకోవాలంటే.. కేవ‌లం నా ప్రతిభను మాత్ర‌మే చూడాలని కోరతాను. నా శ్రమను చూడాలని కోరతాను. అవి నాకు ఎంతో అమూల్యమైనవి. అంతే కానీ, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఒప్పుకోనని చెప్పింది.

తన నటన గురించి మాట్లాడాలే కానీ, తన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడొద్దని శోభిత అభిమానులను కోరింది. ఎలాంటి జీవిత భాగస్వామి కావాలన్న ప్రశ్నకు.. ఒదిగి ఉండే వాడు తనకు కావాలంది. తనతో స‌న్నిహితంగా ఉంటూ, అర్థం చేసుకునేవాడు కావాలని తెలిపింది. ఈ రోజు ఆమె ఉన్న స్థానానికి చేరుకోవడానికి.. తాను ఎదుర్కొన్న కష్టాలను కూడా వెల్లడించింది. ఆమె తన మొదటి ప్రాజెక్ట్‌ను పొంద‌డానికి ముందు ఎన్నో ఆడిషన్‌లకు వెళ్లానని తెలిపింది.


Next Story