ఓ వైపు కేజీఎఫ్-2 టీజర్ రికార్డులు.. మరో వైపు సిగరెట్ వెలిగించినందుకు చిక్కులు

Smoking Scene in KGF Chapter 2 Teaser Irks Karnataka Health Department. కేజీఎఫ్-2 టీజర్ సామాజిక మాధ్యమాల్లో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.

By Medi Samrat  Published on  15 Jan 2021 7:15 AM GMT
ఓ వైపు కేజీఎఫ్-2 టీజర్ రికార్డులు.. మరో వైపు సిగరెట్ వెలిగించినందుకు చిక్కులు

కేజీఎఫ్-2 టీజర్ సామాజిక మాధ్యమాల్లో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఈ టీజర్ లో హీరో ఎలివేషన్ షాట్స్ హైలైట్ అయ్యాయి. కానీ కేజీఎఫ్-2 టీజర్ ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు యశ్‌లకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ టీజర్ చివరి సీన్‌లో తుపాకితో వాహనాలను వరుసగా షూట్ చేసే యశ్.. ఆ తర్వాత తుపాకి గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. ఈ సీన్ వస్తున్నప్పుడు యాంటీ స్మోకింగ్ వార్నింగ్ వేయలేదని ఆరోపిస్తూ కర్ణాటక స్టేట్‌ యాంటీ టొబాకో సెల్‌ నోటీసులు జారీ చేసింది. ఎందుకు వేయలేదో కారణం చెప్పాలని అందులో పేర్కొంది. "ఆ సీన్ చూపించేటపుడు `యాంటీ స్మోకింగ్ వార్నింగ్` వేయలేదు. అందుకే స్టేట్‌ యాంటీ టొబాకో సెల్‌ చిత్ర బృందానికి నోటీసులు నోటీసులు జారీ చేసింది" అని ఓ అధికారి తెలిపారు.


బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ సినిమాలో ఉండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్-2 టీజర్ లో అధీరాగా సంజయ్ దత్ కనిపించాడు. కత్తి పట్టుకుని అతడు చేసే వినాశనం ఒక ఎత్తైతే.. ఆఖర్లో రాకీ భాయ్ పెద్ద గన్ తీసుకుని పోలీసు వాహనాలను కాల్చేసి.. సిగరెట్ వెలిగించుకోవడం టీజర్ కు హైలైట్ గా నిలిచాయి.


Next Story
Share it