Singer Sunitha About Marriage Date. సింగర్ సునీత తన రెండో పెళ్లి గురించి అఫీషియల్‌గా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 31 Dec 2020 6:46 AM GMT
సింగర్ సునీత తన రెండో పెళ్లి గురించి అఫీషియల్‌గా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహ నిశ్చితార్థం ఈ మధ్యే జరిగింది. అయితే అప్పటినుండి ఆమె పెళ్ళి పై ఒక్కొక్కరూ ఒక్కో విధమైన తేదీలను ప్రచారం చేస్తున్నారు. జనవరి 9న తన వివాహం జరగనుందని సునీత స్వయంగా ప్రకటించింది.
ఈ రోజు తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. 10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని.. జనవరి 9న తమ వివాహం జరగనుందని పేర్కొంది. తనకు మంచి జీవితాన్ని అందించాలని స్వామి వారిని కోరుకున్నట్టు మీడియాకు తెలిపింది.
కాగా.. కరోనా నేపథ్యంలో వీరి వివాహం కొద్ది మంది బంధుమిత్రుల మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఈ నెలలోనే పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే.. ఇద్దరి జాతకాల ప్రకారం సరైన ముహూర్తాలు లేకపోవడంతో వచ్చేనెలకు పెళ్లి వాయిదా పడినట్లు తెలిసింది. 19 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న సునీత కొద్ది రోజులకే తన భర్తకు విడాకులు ఇచ్చి అప్పటి నుండి పిల్లలతో కలిసి సపరేట్‌గా ఉంటున్న విషయం తెలిసిందే.