క‌రోనా బారిన‌ప‌డ్డ ప్ర‌ముఖ సింగ‌ర్ కుటుంబం

Singer Sonu Nigam And Family Test Positive For COVID-19. ప్ర‌ముఖ‌ సోను నిగమ్ కుటుంబం క‌రోనా బారిన ప‌డింది. సోను నిగమ్ తో పాటు అతని

By Medi Samrat  Published on  5 Jan 2022 9:52 AM IST
క‌రోనా బారిన‌ప‌డ్డ ప్ర‌ముఖ సింగ‌ర్ కుటుంబం

ప్ర‌ముఖ‌ సోను నిగమ్ కుటుంబం క‌రోనా బారిన ప‌డింది. సోను నిగమ్ తో పాటు అతని భార్య మధురిమ, కొడుకు నివాన్ నిగ‌మ్ ల‌కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా సోను నిగమ్ ఈ విష‌యాన్ని తెలిపాడు. ప్రస్తుతం కుటుంబంతో దుబాయ్‌లో ఉన్నట్లు ఆయ‌న‌ వెల్లడించాడు. తాను ఒక షో షూట్ కోసం భువనేశ్వర్‌కు వెళ్లాల్సి ఉందని.. ప్ర‌స్తుతం తాను ఐసోలేష‌న్‌లో ఉన్నందున వెళ్ల‌డం లేదని తెలిపాడు.

అంద‌రికి 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. నేను దుబాయ్‌లో ఉన్నాను. నేను భువనేశ్వర్‌లో ప్రదర్శన ఇవ్వడానికి, సూపర్ సింగర్ సీజన్ 3 షూటింగ్ కోసం భారత్‌కు రావాల్సి ఉంది. అందుకోసం కొవిడ్ టెస్టు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. మళ్లీ పరీక్షించాను.. పాజిటివ్‌గా ఉంది. మళ్లీ మళ్లీ పరీక్షించాను ఫలితం పాజిటివ్‌గానే తేలింది. నా గొంతు కూడా బాగానే ఉంది.

కానీ నా వల్ల నష్టపోయిన వారి గురించి నేను బాధపడుతున్నాను. కొవిడ్‌ చాలా వేగంగా వ్యాపిస్తోంది. పని ఇప్పుడే ప్రారంభించినందున మా కోసం నేను బాధపడ్డాను. థియేటర్‌లతో అనుబంధం ఉన్న వ్యక్తులు, చిత్రనిర్మాతలకు గత రెండేళ్లుగా పని ప్రభావితం అవుతోందని నేను చింతిస్తున్నాను. అయితే భ‌విష్య‌త్‌లో పరిస్థితులు బాగానే ఉంటాయని ఆశిస్తున్నానని వీడియోలో తెలిపాడు.


Next Story