హీరోకు గాయం.. అభిమానుల రచ్చ

Sidharth Malhotra got injured during the shooting. ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో జట్టు కట్టిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  17 May 2022 5:41 PM IST
హీరోకు గాయం.. అభిమానుల రచ్చ

ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో జట్టు కట్టిన సంగతి తెలిసిందే..! కాప్ ఆధారిత వెబ్ సిరీస్ కోసం రోహిత్ శెట్టి సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పని చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవ్వనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రస్తుతం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే సిరీస్ కోసం గోవాలో షూటింగ్‌లో ఉన్నాడు. సోషల్ మీడియాలో, సిద్ధార్థ్ మల్హోత్రా యాక్షన్ సన్నివేశంలో తనకు గాయాలైనట్లు చూపించాడు.

'ఇండియన్ పోలీస్ ఫోర్స్' షూటింగ్ గోవాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా సిద్ధార్థ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. ఫైటింగ్ సీన్ లో రియల్ గానే సిద్ధార్థ్ కు గాయాలయ్యాయి. తన చేతి నుంచి రక్తం వస్తున్న వీడియోను సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ దెబ్బలతోనే సిద్ధార్థ్ ఈ యాక్షన్ సీన్ ను పూర్తి చేశాడని చిత్ర యూనిట్ చెబుతోంది. సిద్ధార్థ్ కు గాయం అవ్వడాన్ని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరో వైపు కియరా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే ఈ విషయంపై ఏ ఒక్కరు స్పందించలేదు. కానీ ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ నిర్వహించిన ఓ వేడుకలో సిద్ధార్థ్‌ మల్హోత్రా-కియరా అద్వానీ కనిపించారు. ఒకరొకరు నవ్వుకుంటూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు.













Next Story