రామ్ చరణ్ సినిమాల్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమా ఆరెంజ్. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన షాజాన్ పదమ్సీ జూన్ 5, 2025న జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాను వివాహం చేసుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
షాజాన్ పదమ్సీ ఆరెంజ్ తర్వాత రామ్ సరసన మసాలా సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఆమెకు అనుకున్న పేరును సంపాదించలేకపోయింది. దీంతో ఆమె కెరీర్ టాలీవుడ్ లో ఎక్కువ కాలం సాగలేదు. బాలీవుడ్ లో హౌస్ ఫుల్-2 లో నటించి పాపులారిటీని దక్కించుకుంది.