బతికిఉండగానే బయోపిక్.. సంతోషంగా ఉందన్న నటి
Shakeela: I'm happy my biopic has been made when I'm alive. పలు భాషల్లో 250 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా
By Medi Samrat Published on 20 Dec 2020 11:48 AM GMTపలు భాషల్లో 250 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించింది షకీలా. తాజాగా ఆమె బయోపిక్ ఇప్పుడు 'షకీలా' పేరుతోనే ఐదు భాషల్లో రూపుదిద్దుకుంటోంది. రిచా చద్దా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించారు. తన జీవితంపై తాను బతికి ఉండగానే తెరకెక్కుతోన్న బయోపిక్ పై షకీలా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న యువతులు ఎవరూ తనలా తప్పులు చేయవద్దని, మోసపోకూడదన్నారు. తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. కొంతమంది తనను నమ్మించి మోసం చేశారని చెప్పుకొచ్చింది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి భావోద్వేగానికి గురైంది. తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదని.. తాను బ్రతికుండగానే తన బయోపిక్ తెరకెక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. 'షకీలా' చిత్రాన్ని తెరకెక్కించిన ఇంద్రజిత్ లంకేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ చిత్రంలో మహిళల కోసమే ప్రత్యేకంగా ఓ సందేశం ఉందని.. ఇప్పటికే తాను ఈ చిత్రాన్ని చూశానన్నారు. సినిమా ద్వారా మహిళలకు మంచి సందేశాన్ని ఇవ్వడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పింది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.