తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ హస్యనటుడు విశ్వేశ్వర రావు కన్నుమూశారు.

By Medi Samrat
Published on : 2 April 2024 6:40 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ హస్యనటుడు విశ్వేశ్వర రావు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం(ఏప్రిల్ 2) ఉదయం కన్నుమూచారు. అయన మృతి పట్ల అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక హాస్యనటులు విశ్వేశ్వరరావు తెలుగు, తమిళ భాషల్లో 150 పైగా సినిమాల్లో నటించారు. బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరించారు. బుధవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

బాల నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన విశ్వేశ్వరరావు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విస్సు టాకీస్ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న ఆయన తన అనుభవాలను పంచుకుంటూ ఉండేవారు.

Next Story