సీనియర్ నటుడు నరేష్ ఇంటిపై దాడి

Senior actor Naresh's home attacked. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ నివాసంపై దాడి జరిగింది.

By Medi Samrat  Published on  19 Feb 2023 9:15 PM IST
సీనియర్ నటుడు నరేష్ ఇంటిపై దాడి

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ నివాసంపై దాడి జరిగింది. హైదరాబాదులో ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై దుండగులు దాడికి పాల్పడ్డారని నరేశ్ ఆరోపించారు. గత రాత్రి కారును ధ్వంసం చేశారని.. తన భార్య రమ్య రఘుపతి ఈ దాడి వెనుక ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు. రమ్యరఘుపతి తనను చంపేందుకు ప్రయత్నించిందని, ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించారని నరేశ్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవలే తనపై, పవిత్ర లోకేశ్‌పై కొన్ని యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా రమ్య రఘుపతి (నరేశ్ మూడో భార్య) దుష్ప్రచారం చేయిస్తోందని సైబర్ క్రైం పీఎస్‌లో గతంలో పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు నరేశ్‌. మూడు యూ ట్యూబ్‌ ఛానల్స్‌ తమ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి, అన్నీ తెలిసినట్టే ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ ఛానల్‌కు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు నరేశ్‌. ఇటీవలి కాలంలో చాలా విషయాల్లో నరేశ్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.


Next Story