'సీతా రామం' సినిమా రెండో రోజు కలెక్షన్స్ ఇవే..!

Seetha Ramam Second Day Collections. దర్శకుడు హను రాఘవపూడి తీసిన సీతారామం సినిమా ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదలైంది.

By Medi Samrat  Published on  7 Aug 2022 2:00 PM IST
సీతా రామం సినిమా రెండో రోజు కలెక్షన్స్ ఇవే..!

దర్శకుడు హను రాఘవపూడి తీసిన సీతారామం సినిమా ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదలైంది. ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ఉంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం మొదటి రోజు 5.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత ఎక్కువ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. రెండో రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 4.50 కోట్లు వసూలు చేసింది. సినిమా తొలిరోజు కలెక్షన్లతో పోలిస్తే రెండో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.

అయితే.. సీతా రామం సినిమా మొదటి వారం బాక్సాఫీస్ వసూళ్లు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం నాడు చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 11.50 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించబోతున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. . ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మించారు.


Next Story