మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే.. మొదటి క్షణాలు గుర్తొస్తాయి

Sasi Movie Teaser. కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్‌.

By Medi Samrat  Published on  23 Dec 2020 8:55 AM GMT
మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే.. మొదటి క్షణాలు గుర్తొస్తాయి

కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్‌. అయితే.. ఆ త‌రువాత ఆయ‌న న‌టించిన చిత్రాలు పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోతున్నాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'శశి'. శ్రీనివాస్ నాయుడు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న సుర‌భి న‌టిస్తోంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

'మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే మొదటి క్షణాలు గుర్తొస్తాయి' అంటూ ఆది చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. 'ఇష్టమైన పని చేయడానికి.. అవసరం కోసం పని చేయడానికి చాలా తేడా ఉంది' 'అమ్మాయి అందంగా ఉందని ప్రేమించేసి.. తర్వాత ప్రాబ్లమ్స్ లో ఉందని వదిలిస్తే అది లవ్ ఎలా అవుతుంది' వంటి సంభాషణలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. డిఫ‌రెంట్ షేడ్స్‌లో ఆది క‌నిపిస్తున్నాడు. అలాగే ఇంత‌కు ముందు ఎప్పుడూ ట్రై చేయ‌ని లుక్‌లో క‌నిపించి ఓ ల‌వ్ ఫెయిల్యూర్ పెయిన్‌ను ఈ టీజ‌ర్‌లో అవుట్ స్టాండింగ్‌గా చూపించాడు.

ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు సంగీతం సమకూరుస్తుండగా.. అమర్నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, తులసి త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. మొతం మీద ఈ టీజర్ చూస్తుంటే.. ఆది ఖాతాలో హిట్ పడేట‌ట్లుగానే ఉంది.Next Story
Share it