'సర్కారు వారి పాట' ట్రైలర్.. పూనకాలే..

Sarkaru Vari Paata Movie Trailer Release. మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'.

By Medi Samrat  Published on  2 May 2022 4:28 PM IST
సర్కారు వారి పాట ట్రైలర్.. పూనకాలే..

మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈరోజు ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో మహేష్ బాబు డైలాగ్స్ అదిరిపోయాయి. పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించిన సినిమా మే 12న విడుదలకానుంది. మే 2న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు టీమ్ ప్రకటన చేసింది. అనుకున్నట్లుగా అభిమానుల కోసం భ్రమరాంభ థియేటర్ లో సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ ను ఏర్పాటు చేశారు. ఇక ట్రైలర్ ను చూసి అభిమానులకు పూనకాలే..! . నా ప్రేమను దొంగలించగలవు. నా స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బులు దొంగలించ లేవు అన్న మహేష్ బాబు డైలాగులు బాగున్నాయి. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ పొలిటికల్ డైలాగులు చెప్పడం విశేషం. మ్యారేజ్ చేసుకునే వయసొచ్చిందటావా.. ఊరుకోండి సార్.. మీకు పెళ్లేంటి... చిన్న పిల్లాడైతేను. అందరు నీలాగే అనుకుంటున్నారు. ఇక్కడ దూల తీరిపోతుందని.. మహేష్ అన్నాడు.


'సర్కారు వారి పాట' చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు.










Next Story