సర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. మహేష్ ముందున్న టార్గెట్ ఎంతంటే..!

Sarkari Vari Pata Censor Report. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట

By Medi Samrat  Published on  9 May 2022 9:57 AM IST
సర్కారు వారి పాట సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. మహేష్ ముందున్న టార్గెట్ ఎంతంటే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. సర్కారు వారి పాట చిత్రం ఈ నెల 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి.. దాదాపు 162 నిమిషాల 25 సెకన్లు ఉంటుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

స‌ర్కారు వారి పాట చిత్రానికి భారీ స్థాయిలో థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. స‌ర్కారువారి పాట చిత్రానికి రూ.125కోట్ల థియేట్రిక‌ల్ జ‌రిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క్లీన్ హిట్ అవ్వాలంటే రూ.127కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టాల్సి ఉంటుంది. మ‌హేష్ బాబు గ‌తం చిత్రం 'స‌రిలేరు నీకెవ్వ‌రు' రూ.100.35 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఈ చిత్రానికి రూ.25కోట్లు పెరిగింది.

ఏరియా వైజ్ బిజినెస్ ఒక‌సారి గ‌మ‌నిస్తే..

నైజాం : 36 కోట్లు

సీడెడ్ : 13.5 కోట్లు

ఉత్త‌రాంధ్ర : 13 కోట్లు

ఈస్ట్ : 8.5 కోట్లు

వెస్ట్ : 7.0 కోట్లు

గుంటూరు : 9.0 కోట్లు

కృష్ణ : 7.5 కోట్లు

నెల్లూరు : 4.0 కోట్లు

ఏపి+తెలంగాణ : 98.5 కోట్లు

ఓవ‌ర్సీస్ : 11.0 కోట్లు

క‌ర్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా : 23.5 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ : 125 కోట్లు








































Next Story