'సమ్మతమే' వచ్చేస్తోంది ఓటీటీలో..!

Sammathame OTT Release Date Confirmed. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందీని చౌదరి జంటగా డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి డైరెక్షన్‌

By Medi Samrat  Published on  7 July 2022 7:15 PM IST
సమ్మతమే వచ్చేస్తోంది ఓటీటీలో..!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందీని చౌదరి జంటగా డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'సమ్మతమే'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. థియేటర్లలో జూన్ 24న రిలీజైన సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు విడుదల కాబోతోంది. సమ్మతమే సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది. ''కృష్ణుడి లీలలు, సత్యభామ అలకలు కథలే విన్నాము ఇప్పటివరకు.. కానీ, అదే రోల్ రివర్స్ అయితే..?'' అంటూ సమ్మతమే సినిమాను జూలై 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపినాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కిర‌ణ్‌కు జోడీగా 'క‌ల‌ర్‌ఫోటో' ఫేం చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రాన్ని యూజీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కంక‌నాల ప్ర‌శీణ నిర్మించారు. విడుద‌లైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.




Next Story