సమంత శారీ ధర ఎంతో తెలుసా..?

Samantha’s golden sari worth whopping Rs 1,14,999. నటి సమంతా ఖచ్చితంగా ఒక ఫ్యాషన్ ఐకాన్. ఈ విషయం ఆమె అభిమానులకు తెలుసు.

By Medi Samrat  Published on  28 Feb 2022 9:44 AM GMT
సమంత శారీ ధర ఎంతో తెలుసా..?

నటి సమంతా ఖచ్చితంగా ఒక ఫ్యాషన్ ఐకాన్. ఈ విషయం ఆమె అభిమానులకు తెలుసు. తాజాగా సమంత చీరలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ చీరను అర్చన జాజు చేత ఎంబ్రాయిడరీ చేయించారు. చేతితో పెయింట్ చేయబడిన బ్లౌజ్‌తో పాటూ, ఆర్గాన్జా సిల్క్ చీరలో ఆమె కనిపిస్తోంది. అయితే ఈ చీర ధర ఎంత ఉంటుందోనని అభిమానులు కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇంతకూ ఆ చీర ధర ఎంతంటే అక్షరాలా 1,14,999 రూపాయలు. చీరతో పాటు సమంతా అభిలాషా ప్రెట్ జ్యువెలరీ ద్వారా మ్యాచింగ్ స్టేట్‌మెంట్ చెవిపోగులు ధరించింది. అద్భుతమైన స్టైలిస్ట్‌ల బృందాన్ని కలిగి ఉన్న సమంతకు ఈ ఫోటో షూట్ లో ప్రీతం జుకాల్కర్ మేకప్‌ను ఇచ్చారు. రోహిత్ భట్కర్ హెయిర్ స్టైల్ ను తీర్చిదిద్దారు.

సాంఘిక సంక్షేమం కోసం ఆమె చేసిన కృషికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ 2021 అవార్డును అందుకునే సమయంలో సమంతా ఇలా కనిపించింది. నిరుపేద పిల్లల ఆరోగ్యం కోసం పనిచేసే ప్రత్యూష సపోర్ట్ ఆర్గనైజేషన్‌తో సమంత కలిసి పని చేస్తోంది. ఇక సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయగా.. గుణశేఖర్ దర్శకత్వం వహించిన పురాణ పౌరాణిక ప్రేమకథ 'శాకుంతలం'లో సమంతా మొదటిసారిగా యువరాణిగా కనిపించనుంది. నయనతార, విజయ్ సేతుపతితో కలిసి 'కాతు వాకుల రెండు కాదల్' సినిమా రిలీజ్ కోసం ఆమె ఎదురుచూస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించిన 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్'తో సమంత హాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది.


Next Story
Share it