Samantha shares a sneak peek from rehearsals and its all things fun. అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ సినిమాలోని 'ఊ అంటావా' సాంగ్ సినిమాకే హైలైట్.
By Medi Samrat Published on 6 Jan 2022 12:50 PM GMT
అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ సినిమాలోని 'ఊ అంటావా' సాంగ్ సినిమాకే హైలైట్. సమంతా రూత్ ప్రభు నటించిన ఈ పాటలో ఆమె సెక్సీ డ్యాన్స్ మూవ్‌స్ కు అందరూ ఫిదా అయిపోతారు. ఊ అంటావా సాంగ్ సమంత మొదటి స్పెషల్ సాంగ్. సినిమా హాల్ లో ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేసిన సాంగ్. ఇప్పుడు సినిమా విడుదలైన కొన్ని వారాల తర్వాత, సామ్ రిహార్సల్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. సాంగ్ రిహార్సల్స్ విషయంలో సమంత చాలా కష్టపడి పనిచేసింది. తాను ఎంతో కష్టపడి డ్యాన్స్ చేస్తున్నానని.. మిగిలిన వాళ్లకు కనీసం చెమట రావట్లేదని సమంత నవ్వుతూ చెప్పడం వీడియోలో మనం చూడవచ్చు.
అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బ్లక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలై మూడు వారాలు దాటినా ఇప్పటికీ కలెక్షన్ల జోరు తగ్గలేదు. కరోనా వైరస్, ఒమిక్రాన్ కాలంలోనూ పుష్ప అన్ని భాషల్లో మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300కోట్ల ట్రేడ్ మార్క్‌ను దాటేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఇక జనవరి 7 రాత్రి 8 గంటల నుంచి పుష్ప స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది.