సమంత 'శాకుంతలం' ఓటీటీ రిలీజ్ ఫిక్స్‌

Samantha Shaakuntalam movie is releasing on May 12 in OTT. ఇటీవలి కాలంలో ఎన్నో అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా నిలిచిన సినిమా 'శాకుంతలం'.

By Medi Samrat
Published on : 5 May 2023 9:15 PM IST

సమంత శాకుంతలం ఓటీటీ రిలీజ్ ఫిక్స్‌

Samantha Shaakuntalam movie is releasing on May 12 in OTT

ఇటీవలి కాలంలో ఎన్నో అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా నిలిచిన సినిమా 'శాకుంతలం'. పెట్టిన బడ్జెట్ కు.. వచ్చిన కలెక్షన్స్ కు ఏ మాత్రం సంబంధం లేదు. సమంత ప్రధాన పాత్రలో పౌరాణిక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత నటించగా.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించాడు. మోహన్ బాబు, అనన్య నాగళ్ల, సచిన్ ఖేడ్కర్, గౌతమ్, మధుబాల కీలక పాత్రలను పోషించారు. ఇక ఈ సినిమాను గుణశేఖర్ తనయ నీలిమ గుణతో కలిసి దిల్ రాజు నిర్మించారు. అరవై కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కనీసం ఇరవై కోట్లు కూడా రాబట్టలేదు.

ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో విడుదల చేయనున్నారు. మే 12న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. దాదాపు 20 కోట్ల‌కు ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను థియేటర్లలో చూడని వాళ్లు.. ఓటీటీలో చూసే అవకాశం ఎక్కువగానే ఉంది. సమంతకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఓటీటీలో బాగానే వ్యూస్ రావచ్చు.


Next Story