'శాకుంతలం' సినిమాతో దిల్ రాజు భారీగా నష్టపోయారా..?

Shaakuntalam turns out to be a jolt for Dil Raju. గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా శాకుంతలం.

By Medi Samrat  Published on  19 April 2023 7:30 PM IST
శాకుంతలం సినిమాతో దిల్ రాజు భారీగా నష్టపోయారా..?

గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా శాకుంతలం. సమంతా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయి.

శాకుంతలం కో-ప్రొడ్యూసర్‌గా చేరిన దిల్ రాజుకు ఈ సినిమాతో నష్టాలు వచ్చాయని అంటున్నారు. బలగం సినిమాతో మంచి లాభాలు అందుకున్న దిల్ రాజు ఈ సినిమాతో చాలా నష్టాలు చవి చూసారని అంటున్నారు. సమంతా బ్రాండ్ ఇమేజ్‌పైనే దిల్ రాజు నమ్మకం పెట్టుకున్నారని.. ఆ నమ్మకమే వమ్ము అయిందని అన్నారు. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ‘శాకుంతలం’ రూపొందగా.. ఇతర ఖర్చులతో కలిపి సినిమా మొత్తం బడ్జెట్ రూ.60 కోట్ల రూపాయలకు చేరింది. సినిమా విడుదలకు ముందే రూ.35 కోట్ల రూపాయలకు ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు అమ్మేశారు. శాటిలైట్ ఛానల్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి దిల్ రాజు ప్రయత్నించారని.. అయితే అందుకు తగ్గ డీల్ కుదరలేదనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో సినిమా కారణంగా దిల్ రాజు బాగా నష్టపోయారని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.




Next Story