శాకుంతలం బాక్సాఫీసు ఫెయిల్యూర్ తర్వాత.. సమంత పెట్టిన పోస్టు చూశారా..?

Samantha Ruth Prabhu Shares A Cryptic Post After Shaakuntalam Box Office Failure. సమంత-గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ దారుణంగా వచ్చాయి

By M.S.R  Published on  18 April 2023 5:57 PM IST
శాకుంతలం బాక్సాఫీసు ఫెయిల్యూర్ తర్వాత.. సమంత పెట్టిన పోస్టు చూశారా..?

Samantha Ruth Prabhu


సమంత-గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ దారుణంగా వచ్చాయి. శాకుంతలం బాక్సాఫీస్ ఫెయిల్యూర్ మధ్య, సమంతా రూత్ ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త చిత్రాన్ని పంచుకున్నారు. ఆ ఫోటోకు ఆమె పెట్టిన క్యాప్షన్ భగవద్గీతలోని శ్లోకం అని తెలుస్తోంది. ఆ చిత్రంలో సమంత కిటికీలోంచి చూస్తోంది. ఆమె డెనిమ్ జాకెట్, బ్లాక్ ఫ్రేమ్ సన్ గ్లాసెస్‌తో నల్లటి టీ-షర్టులో ఉంది. ఆ క్యాప్షన్‌లో, "కర్మణ్యే వాధికా రుచి మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హే తుర్ భూః మా తే సంఘోత్స్వ కర్మణి" అని ఆమె రాసింది. ‘నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది తప్ప దాని ఫలితం మీద కాదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చేయి’ అన్నది అర్థం.



గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆమె చివరిగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా యశోదకు కూడా మిశ్రమ సమీక్షలు వచ్చిన.. బాక్స్-ఆఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకుంది. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు ₹ 5 కోట్లు వసూలు చేసింది. లాంగ్ రన్ మాత్రం లేకుండాపోయింది.


Next Story