సమంత శాకుంతలం మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే..?

Shaakuntalam box office collection Day 1. సమంత-గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.

By M.S.R  Published on  15 April 2023 11:16 AM IST
సమంత శాకుంతలం మొదటిరోజు కలెక్షన్స్ ఎంతంటే..?

సమంత-గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం కాళిదాసు నాటకం అభిజ్ఞానశాకుంతలం నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కేవలం రూ. 5 కోట్లు మాత్రమే రాబట్టింది. శాకుంతలం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎక్కువ స్క్రీన్‌లలో విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజు భారీగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. అన్ని భాషలలో 5 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో శాకుంతలం మొత్తం 32.60 శాతం ఆక్యుపెన్సీని పొందింది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ చూస్తే.. నైజాంలో 4 కోట్లు, సీడెడ్ 1.50కోట్లు, ఆంధ్ర 5.00కోట్లు, ఏపీ,తెలంగాణ 10.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.20 కోట్లు, మిగిలిన భాషల్లో 4.00 కోట్లు, ఓవర్సీస్ 1.80 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 17.50 కోట్ల బిజినెస్ జరిగింది.

గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, గౌత‌మి, మ‌ధుబాల‌, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. అల్లు అర్హ మొదటిసారి కెమెరా ముందుకొచ్చింది. ఈ సినిమాకు యుఎస్ఏ లో ప్రీమియర్స్, ఫస్ట్ డేకు గాను 125K డాలర్స్ వసూలైనట్లు తెలిసింది. రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా యుఎస్ఏ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు.


Next Story