టాటూలపై సమంత ఇచ్చే సూచన ఇదే..!
Samantha Ruth Prabhu advices Never Ever Get a Tattoo. టాటూలు వేయించుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయింది.
By Medi Samrat Published on
18 April 2022 10:24 AM GMT

టాటూలు వేయించుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయింది. పలువురు సెలెబ్రిటీలు కూడా టాటూలను వేయించుకుంటూ ఉంటారు. ఆ లిస్టులో సమంత కూడా ఉన్న సంగతి తెలిసిందే..! ఒకప్పుడు చైతూతో లవ్ లో ఉన్న సమయంలో సమంత టాటూ వేయించుకుంది. ఆ టాటూ బాగా పాపులర్ అయింది. తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఓ అభిమాని సమంత ను టాటూల గురించి అడిగాడు.. అప్పుడు ఆమె నుండి ఊహించని సమాధానం వచ్చింది.
తాను మొదట టాటూలు వేయించుకోకూడదని అనుకున్నానని... కానీ ఆ తర్వాత వేయించుకున్నానని తెలిపింది. టాటూల ఎవరూ వేయించుకోవద్దని, ఆ ఆలోచన కూడా మానుకోవాలని సూచించింది. సమంత నడుము పైభాగంలో తన మాజీ భర్త నాగచైతన్య పేరు 'చై' అనే టాటూ ఉన్న సంగతి తెలిసిందే. వీపుపై, కుడి చేతిపై మరో రెండు టాటూలు ఉన్నాయి.
ఇక ఎన్నో విషయాలను సమంత అభిమానులతో పంచుకుంది. తాను చూసిన ఫస్ట్ మూవీ 'జురాసిక్ పార్క్' అని సమంత తెలిపింది. ఓ హోటల్ లో తాను హోస్టెస్ గా పని చేశానని ఎనిమిది గంటలు పని చేసి రూ. 500 అందుకున్నానని తెలిపింది. అదే తన తొలి సంపాదన అని చెప్పింది.
Next Story