సినిమాలకు సైన్ చేయకపోయినా సమంత క్రేజ్ మామూలుగా లేదు

Samantha is the most recognizable female celebrity. స్టార్స్ ఇండియా అనే సంస్థ భారతదేశంలో ఉన్న స్టార్స్ పై సర్వేను నిర్వహిస్తూ ఉంటుంది.

By Medi Samrat
Published on : 22 July 2023 6:28 PM IST

సినిమాలకు సైన్ చేయకపోయినా సమంత క్రేజ్ మామూలుగా లేదు

స్టార్స్ ఇండియా అనే సంస్థ భారతదేశంలో ఉన్న స్టార్స్ పై సర్వేను నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా జూన్ నెలకు గాను ఇండియాలోని టాప్ హీరో అండ్ హీరోయిన్ అనేదానిపై సర్వే నిర్వహించింది. అందులో భాగంగా రిజల్ట్ ను విడుదల చేశారు. ఇందులో దేశంలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా సమంత నిలవడం విశేషం. జూన్ 2023లో నం. 1 మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్‌లో Ormax స్టార్స్ ఇండియా లవ్స్ (ఆల్ ఇండియా) జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిదోసారి, సమంతా రూత్ ప్రభు ఈ లిస్టులో అగ్రస్థానాన్ని పొందింది.

ఇక సమంత కొత్తగా సినిమాలను ఒప్పుకోవడం లేదు. ముందుగా కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను పూర్తీ చేయాలని ఫిక్స్ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉంది. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నాడు. షూటింగ్స్, ప్రమోషన్స్ పూర్తవ్వగానే మాయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లనుంది సమంత.


Next Story