అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత

Samantha is suffering from a rare disease. సమంత రూత్ ప్రభు.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది

By Medi Samrat  Published on  29 Oct 2022 5:08 PM IST
అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత

సమంత రూత్ ప్రభు.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఈ మధ్య ఆమె కనీసం కనిపించలేదు. ఎటువంటి పోస్టులు కూడా పెట్టలేదు. చాలా మంది ఆమె అనారోగ్యం పాలైందని.. విదేశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉందని చెప్పుకొచ్చారు. తాజాగా సమంత తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ను ఇచ్చింది. దీంతో ఆమె బాగుండాలని.. వీలైనంత త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు.

ఇంతకూ సమంతకు ఏమైందంటే :

తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత తెలిపింది. అంతేకాకుండా చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను షేర్‌ చేసింది. తాను బాధపడుతున్న వ్యాధి గురించి అసలు విషయం బయటపెట్టింది. మ్యోసిటిస్ అంటూ తనకు వచ్చిన వ్యాధి గురించి చెబుతూ తన పరిస్థితిని వివరించింది సమంత. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది సామ్. కొన్ని నెలల నుంచి 'మయోసిటిస్‌'( కండరాల బలహీనత) అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలిపింది. ఈ విషయాన్ని పూర్తిగా రికవర్‌ అయ్యాక మీతో చెబుదాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుందని సమంత తెలిపింది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని ఇప్పుడు రియలైజ్‌ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. నేను త్వరలోనే కోలుకుంటానని డాక్టర్స్‌ కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా నాకు మంచి రోజులు, అలాగే చెడు రోజులు ఉన్నాయి. నేను ఇదంతా హ్యాండిల్‌ చేయలేనేమో అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది సమంత.



Next Story