మా ఫ్రిజ్ లో మీరనుకునేవి ఉండవంటున్న మెగాస్టార్.!

Sam Jam Mega Promo. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్

By Medi Samrat  Published on  20 Dec 2020 4:45 AM GMT
మా ఫ్రిజ్ లో మీరనుకునేవి ఉండవంటున్న మెగాస్టార్.!

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయినా సమంత కలిసి ఒకే వేదికపై సందడి చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్వహిస్తున్న "ఆహా" అనే యాప్ ద్వారా "సామ్ జామ్" టాక్ షో కి సమంత అక్కినేని వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ షో ద్వారా సినీ సెలబ్రిటీలు పాల్గొని వారి వ్యక్తిగత విషయాల గురించి సమంత ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకుంటారు.

ఇప్పటికే సామ్ జామ్ షో విజయ్ దేవరకొండతో ప్రారంభమై, రానా, క్రిష్, తమన్నా, రకుల్ వంటి సెలబ్రిటీస్ వారి వ్యక్తిగత విషయాలను సమంతతో పంచుకొని ఎంతో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ మెగా హీరో చిరంజీవి కూడా "సామ్ జామ్"షో కి వస్తారన్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే మెగాస్టార్ సమంతతో కలిసి సందడి చేశారు.

ఈ టాక్ షోలో భాగంగా సమంత చిరంజీవిని "మీ ఫ్రిజ్ లో ఎప్పుడూ ఉండే ఓ ఐటమ్ ఏమిటి? అనే ప్రశ్నను సమంత అడిగగా, అందుకు మెగాస్టార్ మీరు అనుకునేది అసలు కాదంటూ మెగాస్టార్ ఎంత సరదాగా నవ్వులు-పువ్వులు పూయించారు.ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ పాల్గొన్న ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది.

సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. తొందర్లోనే ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపారు.

Next Story