సాయి పల్లవిని ముద్దు సీన్ నుండి కాపాడిన హీరో

Sai Pallavi Open about how she Escaped liplock seen. సాయిపల్లవి.. ఆమె కంటూ ఓ క్రేజ్ ఉంది. పాత్ర తనకు నచ్చాలి.. ఎటువంటి

By Medi Samrat  Published on  14 Dec 2020 2:46 PM IST
సాయి పల్లవిని ముద్దు సీన్ నుండి కాపాడిన హీరో

సాయిపల్లవి.. ఆమె కంటూ ఓ క్రేజ్ ఉంది. పాత్ర తనకు నచ్చాలి.. ఎటువంటి అసభ్యత కూడా ఉండకూడదు. అలా ఉన్నప్పుడే సినిమా నటించడానికి ఒప్పుకుంటుంది. లేదంటే ఇంకెవరినైనా చూసుకోమని చెబుతూ ఉంటుంది. సాయి పల్లవి కోసమే కొందరు దర్శకులు కథలను రెడీ చేసుకుంటూ ఉంటారు.

తాజాగా సాయి పల్లవి తనను కిస్సింగ్ సీన్ చేయమని ఓ డైరెక్టర్ తెగ ఇబ్బంది పెట్టాడని వెల్లడించింది. హీరోతో లిప్ లాక్ ముద్దు సన్నివేశం చేయాలని, చిత్రకథకు ఆ సన్నివేశం ఎంతో కీలకమని ఆ చిత్ర దర్శకుడు సాయిపల్లవిని బలవంతపెట్టాడట. అలాంటి సన్నివేశాలు చేయడం తనకు ఇష్టం ఉండదనీ, చాలా ఇబ్బంది పడతాననీ ఆమె చెప్పిందట.

సాయిపల్లవి ఇబ్బంది పడుతూ ఉండడం గమనించిన ఆ సినిమా హీరో మధ్యలో కలుగజేసుకున్నాడట. ఆ అమ్మాయిని మీరు ఇలా బలవంతపెడితే 'మీటూ' ఉద్యమంలో ఇరుక్కునే ప్రమాదం ఉందంటూ హెచ్చరించాడట. దాంతో ఆ దర్శకుడు ఆ ముద్దు సీనుని విరమించుకున్నాడనీ సాయిపల్లవి తాజాగా చెప్పింది.

ఎన్నో విషయాలు సాయి పల్లవి ఇటీవల తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పలు ఇండస్ట్రీలలో ఉండే తేడాలను సాయి పల్లవి చెప్పుకొచ్చింది. మలయాళం సినిమా షూటింగ్ సమయంలో అందరినీ ఒకే విధంగా చూస్తారని వెల్లడించింది. కానీ తెలుగు సినిమా షూటింగ్ లకు వస్తే మాత్రం.. హీరోలకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుందని తెలిపింది.


Next Story