900 కోట్ల మార్కు దాటేసిన ఆర్ఆర్ఆర్.. టాప్ లో ఉన్న సినిమాలు ఏవంటే..

RRR rises to Third topping Rs. 900 crores. S.S. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR విడుదలైన పన్నెండవ రోజున రూ.900కోట్ల మార్కును దాటేసింది

By Medi Samrat  Published on  6 April 2022 12:03 PM GMT
900 కోట్ల మార్కు దాటేసిన ఆర్ఆర్ఆర్.. టాప్ లో ఉన్న సినిమాలు ఏవంటే..

S.S. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR విడుదలైన పన్నెండవ రోజున రూ.900కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల కలెక్షన్స్ సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. మంగళవారం నాటికి సుమారు 913 కోట్లు సాధించిన RRR.. 2015 విడుదలైన భజరంగీ భాయిజాన్‌ సినిమాను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో ఉన్న సినిమాలు దంగల్, బాహుబలి: ది కన్‌క్లూజన్. RRR ఆ చిత్రాల కలెక్షన్స్ అందుకోవడం కష్టమనే చెప్పవచ్చు. చైనా మార్కెట్ ను మినహాయించి సాంప్రదాయ మార్కెట్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, RRR బాహుబలి-2 కంటే వెనుకబడి ఉంది. ఆర్ఆర్ఆర్ ఫైనల్ బిజినెస్ 1125-1150 కోట్లు ఉండవచ్చని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ఇక చైనాలో సినిమాను విడుదల చేస్తారా లేదా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్ టైమ్ టాప్ టెన్ భారతీయ చలనచిత్రాలు :

దంగల్ - రూ. 2008.30 కోట్లు

బాహుబలి: ది కన్‌క్లూజన్ - రూ. 1754.50 కోట్లు

RRR - రూ. 913 కోట్లు (12 రోజులు)

బజరంగీ భాయిజాన్ - రూ. 902.80 కోట్లు

సీక్రెట్ సూపర్ స్టార్ - రూ. 895.50 కోట్లు

PK - రూ. 762 కోట్లు

2.0 - రూ. 666.30 కోట్లు

సుల్తాన్ - రూ. 616.60 కోట్లు

సంజు - రూ. 588.30 కోట్లు

బాహుబలి: ది బిగినింగ్ - రూ. 581 కోట్లుNext Story
Share it