టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత క‌న్నుమూత‌

RR Venkat Passed Away. టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ నిర్మాత ఆర్.ఆర్. వెంక‌ట్ క‌న్నుమూశారు.

By Medi Samrat  Published on  27 Sep 2021 3:39 AM GMT
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ నిర్మాత ఆర్.ఆర్. వెంక‌ట్ క‌న్నుమూశారు. కిడ్ని సంబంధిత వ్యాధితో గ‌చ్చ‌బౌలిలోని ఏఐజీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచారు. వెంక‌ట్ ఆర్.ఆర్.మూవీస్ బ్యాన‌ర్‌పై ప‌లు విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌ను నిర్మించారు. సామాన్యుడు, ఆంధ్రావాల‌, ఢ‌మ‌రుకం, కిక్‌, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మిర‌ప‌కాయ్‌, బిజినెస్ మ్యాన్‌, పైసా, పూల‌రంగ‌డు, బ‌హుమ‌తి, ల‌వ్ లీ, మాయ‌జాలం వంటి చిత్రాల‌ను నిర్మించారు. వెంక‌ట్ ఇంగ్లీష్‌లో డైవ‌ర్స్ ఇన్విటేష‌న్ అనే సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అలాగే హిందీలోనూ.. ఏక్ హ‌సీనా తీ, జేమ్స్ అనే రెండు చిత్రాల‌ను కూడా నిర్మించారు. వెంక‌ట్ మ‌ర‌ణ‌వార్తతో టాలీవుడ్‌లో ఒక్క‌సారిగా విషాదం నెల‌కొంది. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు సంతాపాన్ని తెలియ‌జేశారు.

వెంక‌ట్ మృతి ప‌ట్ల మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ సంతాపాన్ని తెలియ‌జేశారు. ఆర్ ఆర్ వెంకట్ మ‌ర‌ణం నిజంగా బాధాకరం. నేను పనిచేసిన ఉత్తమ నిర్మాతలలో ఒకరు. ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం తెలియ‌జేస్తున్నాన‌ని ట్వీట్ చేశారు. వెంక‌ట్ నిర్మాత‌గా ర‌వితేజ‌తో కిక్‌, మిర‌ప‌కాయ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు.
Next Story