అమ్మాయిని పట్టుకుని ఊగిపోతూ... నేను కాదంటున్న వర్మ

RGV Tweets About His Dancing Video. రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వార్తల్లో ఉండడు చెప్పండి..! ఇప్పుడు కూడా ఎప్పటిలాగే

By Medi Samrat  Published on  23 Aug 2021 8:39 AM GMT
అమ్మాయిని పట్టుకుని ఊగిపోతూ... నేను కాదంటున్న వర్మ

రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వార్తల్లో ఉండడు చెప్పండి..! ఇప్పుడు కూడా ఎప్పటిలాగే వార్తల్లోనే నిలిచాడు. ఓ అమ్మాయిని గట్టిగా హత్తుకుని.. ఆమె చుట్టూ తిరుగుతూ.. కాళ్ల మీద పడుతూ.. వామ్మో ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నాడు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే వర్మ మాత్రం అది నేను కాదు అని చెప్పేస్తూ ఉన్నాడు. 'లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ' ఫేస్ బుక్ అకౌంట్‌లో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్ ఉండ‌గా, వారు క్లాప్స్ కొట్టి ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి కొంద‌రు నెటిజ‌న్స్ వ‌ర్మ‌ని ఏకి పారేస్తుండ‌గా, కొంద‌రు వ‌ర్మ‌లా బ్ర‌తకాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నేను మరొక్కసారి క్లారిటీగా చెప్పాలని అనుకుంటున్నాను.. ఆ వీడియోలో ఉన్న మనిషి నేను కాదు.. రెడ్ డ్రెస్సులో ఉన్నది సుల్తానా కాదు.. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ మీద ఒట్టేసి చెబుతున్నాను అని వర్మ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ ఇంటర్వ్యూలను చూస్తే అమ్మాయిలతో పులిహోర ఎలా కలపాలో తెలుస్తుంది. ఇక అమ్మాయిల అందాలను తెరపై ఎలా చూపించాలో కూడా ఆర్జీవీ తన సినిమాల ద్వారా ఇప్పటికే ప్రూవ్ చేశాడు.


Next Story
Share it