'మా'పై వర్మ సెటైర్లు.. నిజంగా సర్కస్‌ వాళ్లమని రుజువు చేశారంటూ..!

RGV satirical comment on maa. ఆర్జీవీ అంటేనే సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఆయన ఎప్పుడు ఎదో ఒక వివాదంతో సోషల్‌ మీడియాలో నానుతూనే

By అంజి  Published on  17 Oct 2021 7:57 AM GMT
మాపై వర్మ సెటైర్లు.. నిజంగా సర్కస్‌ వాళ్లమని రుజువు చేశారంటూ..!

ఆర్జీవీ అంటేనే సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఆయన ఎప్పుడు ఎదో ఒక వివాదంతో సోషల్‌ మీడియాలో నానుతూనే ఉంటాడు. ఇటీవల 'మా' (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మంచు విష్ణు, ప్రకాష్‌ రాజ్‌ ప్యానెళ్లు రెండు కూడా మాటల దాడులు చేసుకున్నారు. కాగా తాజా 'మా' పరిణామాలపై ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. 'మా' వ్యవహారాన్ని చూస్తుంటే సర్కార్‌ చూస్తున్నట్లు ఉందన్నారు. సినీ 'మా' అసోసియేషన్ సభ్యులు తాము సర్కస్ వాళ్లమని ప్రేక్షకులకు రుజువు చేశారంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్‌ చేశాడు. కాగా ఈ ట్వీట్‌ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఇటీవల బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ మీద కూడా ఆర్జీవీ సంచలన ట్వీట్లు చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ వరంగల్‌లోని కొండా సురేఖ, మురళీ దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా 'కొండా' పేరుతో సినిమా రూపొందిస్తున్నాడు.

మాటల తుటాలు, గ్రూప్‌ రాజకీయాలతో మొదలైన 'మా' ఎన్నికలు చివరికి మంచు విష్ణు విజయం సాధించారు. నిన్న 'మా' అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి ఆహ్వానం అందలేదు.

Next Story
Share it