విధ్వంసం ఆపడానికి ప్రయత్నించండి, HCU భూమి వేలంపై సీఎంకు రేణూ దేశాయ్ రిక్వెస్ట్
నటి రేణూ దేశాయ్ తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపాలంటూ రేవంత్ రెడ్డిని వేడుకున్నారు.
By Knakam Karthik
విధ్వంసం ఆపడానికి ప్రయత్నించండి, HCU భూమి వేలంపై సీఎంకు రేణూ దేశాయ్ రిక్వెస్ట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై వివాదం తీవ్ర స్థాయిలో రాజుకుంది. ఓ వైపు కంచ గచ్చిబౌలి భూములను రక్షించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటి రేణూదేశాయ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె అభ్యర్థించారు.
ఇప్పటికే ఈ వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నటి రేణూ దేశాయ్ తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపాలంటూ రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం గురించి నాకు రెండు రోజుల ముందు తెలిసింది. ఈ విషయంపై అన్ని తెలిసిన తర్వాత మాట్లాడుదామని సమయం తీసుకున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు 44 ఏండ్లు.. రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలు.. మనందరి పిల్లలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. వారికి ఆక్సిజన్ కావాలి.. వాటర్ కావాలి. వారి భవిష్యత్ కోసం ఆలోచించండి. అభివృద్ధి అనేది జరగాలి కానీ ఈ 400 ఎకరాల విధ్వంసం ఆపేందుకు ప్రయత్నించండంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.
Actress #RenuDesai about #SaveKanchaGachibowli #SaveHCU https://t.co/tjP4TXYMs6 pic.twitter.com/gEWIHjCU4L
— Johnnie Walker (@Johnnie5ir) April 1, 2025
మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. జీవ వైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ తెలంగాణ మంత్రులు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.