నిహారిక పెళ్లి రోజే.. రేణూ దేశాయ్ ఆ వీడియోలో అలా చెప్పాలా..?

Renu Desai Emotional About Breakup. రేణూ దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు.. ఓ వైపు మెగా కుటుంబం మొత్తం నిహారిక పెళ్లి

By Medi Samrat  Published on  10 Dec 2020 7:43 AM GMT
నిహారిక పెళ్లి రోజే.. రేణూ దేశాయ్ ఆ వీడియోలో అలా చెప్పాలా..?

రేణూ దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు.. ఓ వైపు మెగా కుటుంబం మొత్తం నిహారిక పెళ్లి సందడిలో ఉన్నారు. రేణూ దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్, వారి కుమారుడు అకీరా, కుమార్తె ఆద్య కూడా పెళ్లికి హాజరయ్యారు. అకీరా హైట్ గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా అవుతోంది. ఓ వైపు నిహారిక పెళ్లి సంబరాల్లో అందరూ ఉండగా.. పెళ్లికి సంబంధించిన పలు విషయాలను రేణూ దేశాయ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. బంధం, బంధుత్వం అన్నవి ఎలా ఉండాలో ఆమె వివరించారు. అందుకు సంబందించిన ఓ వీడియోను విడుదల చేశారు. నిహారిక వివాహం జరుగుతున్న రోజునే ఈ వీడియోను ఆమె విడుదల చేయడంతో వైరల్ అయింది.

చాలా మంది తమ భర్త మంచిగా లేరని తెలిసి కూడా అతనితో మంచిగా ఉండేందుకే ప్రయత్నిస్తారని చెప్పిన రేణూ దేశాయ్.. అది భారతీయ మహిళలకు అలవాటై పోయిందని.. ఏ వివాహమైనా బ్రేకప్ అయిందంటే, దానికి ఏదో ఒక కారణం ఉంటుందని, దాన్ని కర్మ అని కూడా అనుకోవచ్చని ఆమె అన్నారు.

ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ముందడుగు వేయాలని.. తాను ఈ అడుగులన్నీ వేసుకుంటూనే వచ్చానని, అందరి ఆశీర్వాదంతో కొత్త జంట జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండానే నిహారిక, చైతన్య దంపతులకు తన విషెస్ చెప్పిందని నెటిజన్లు అంటున్నారు. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వేళ ఎంతో చీకటిగా అనిపిస్తుందని, కానీ ఆ చీకటి నుంచి మానసిక దృఢత్వం, స్వయంకృషితోనే బయటకు రావాలని ఆమె అన్నారు. ఎవరో వచ్చి సాయం చేస్తారని అనుకోవద్దని చెప్పుకొచ్చారు రేణూ.Next Story
Share it