Ravanasura Trailer : కొత్తదనంతో వస్తున్న రావణాసుర.. ట్రైలర్ అదిరిపోయిందిగా..!

Ravanasura Movie Trailer. రవితేజ వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు.

By Medi Samrat
Published on : 28 March 2023 11:43 AM

Ravanasura Trailer : కొత్తదనంతో వస్తున్న రావణాసుర.. ట్రైలర్ అదిరిపోయిందిగా..!

Ravanasura Movie Trailer


రవితేజ వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొన్ని రొటీన్ సినిమాలు చేస్తూనే.. మరికొన్ని సినిమాలకు సంబంధించి కొత్తదనం ట్రై చేస్తూ వస్తున్నాడు. అలాంటి కోవలోకే 'రావణాసుర' సినిమా వస్తుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కామెడీతోపాటు క్రైం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీలో రవితేజ లాయర్ గా కనిపించనున్నారు. క్రైమ్ చుట్టూ సాగే ఈ సినిమాలో డైలాగ్స్ కూడా బాగున్నాయి.

సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా అలరించనున్నారు. సుశాంత్ కీలక పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. ఏప్రిల్ 7న రావణాసుర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు.



Next Story