రష్మిక చేస్తోంది రిస్కేనా..?

Rashmika Mandanna's female-centric film titled Rainbow. రష్మిక మందన్న భాషలతో సంబంధం లేకుండా పలు సినిమాలను చేసుకుంటూ వెళుతోంది.

By M.S.R  Published on  3 April 2023 5:49 PM IST
రష్మిక చేస్తోంది రిస్కేనా..?

Rashmika Mandanna


రష్మిక మందన్న భాషలతో సంబంధం లేకుండా పలు సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే తొలిసారి కథానాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలో రష్మిక కనిపించబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘రెయిన్ బో’ అనే పేరు ఖరారు చేశారు. తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌ ప్రకాష్‌ బాబు నిర్మిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరణ్ స్వరాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం రష్మిక, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్‌ సినిమాలో నటిస్తోంది. ఇక పుష్ప సీక్వెల్‌లోనూ, నితిన్‌-వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ర‌ష్మిక‌కు జోడీగా మ‌ల‌యాళ న‌టుడు శాకుంతలం ఫేమ్ దేవ్ మోహ‌న్ న‌టిస్తున్నారు. ఏప్రిల్ 7 నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.


Next Story