నితిన్ - రష్మిక జంట‌గా మ‌రో సినిమా.. సినిమా డైరెక్ట‌ర్ వీళ్ళ‌కు ఓ హిట్ ఇచ్చాడు కూడా..!

Nithiin, Rashmika Mandanna, Venky Kudumula Trio New Film. నితిన్ - రష్మిక కాంబినేషన్లో గతంలో వచ్చిన 'భీష్మ' భారీ విజయాన్ని సాధించింది.

By M.S.R  Published on  24 March 2023 8:15 PM IST
నితిన్ - రష్మిక జంట‌గా మ‌రో సినిమా.. సినిమా డైరెక్ట‌ర్ వీళ్ళ‌కు ఓ హిట్ ఇచ్చాడు కూడా..!

నితిన్ - రష్మిక కాంబినేషన్లో గతంలో వచ్చిన 'భీష్మ' భారీ విజయాన్ని సాధించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నితిన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కింది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. చిరంజీవి క్లాప్ తో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. బాబీ, గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, బుచ్చిబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'భీష్మ' సినిమా 2020లో వచ్చింది. ఆ సినిమా తరువాత వెంకీ కుడుముల నుంచి మరో ప్రాజెక్టు రాలేదు. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాతో, మరో బ్లాక్ బస్టర్ దొరుకుతుందేమో చూడాలి. వెంకీ కుడుముల మొదటి సినిమా ఛలోలో కూడా రష్మికనే హీరోయిన్ గా చేసింది.

కొద్దిరోజుల కిందటే ఈ కాంబినేషన్ కు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేశారు. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల, జీవీ ప్రకాశ్ మధ్య సంభాషణలు ఎంతో ఫన్నీగా సాగాయి. రష్మిక మాట్లాడుతూ.. నేను ఒక్క మాట మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్సీలు అయ్యిపోతున్నాయని చెప్పగా, నితిన్ అది చాలా బెటర్ నేను ఒక్క హిట్టు ఇస్తుంటే రెండు మూడు ప్లాప్‌లు అవుతున్నాయి పరిస్థిని చెప్పుకొచ్చారు. హీరో అనుకుని జీవీ ప్రకాశ్ రాగా.. మ్యూజిక్ మాత్రమే అని చెప్పి సైడ్ చేయడం కూడా బాగుంది. ఇక సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారో అని అభిమానులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు.


Next Story