హిట్ ఇచ్చిన ఆ డైరెక్ట‌ర్‌తో మ‌రో మూవీకి రెడీ అవుతున్న‌ నితిన్..!

Hero Nithin and Venky Kudumula team again new film. ఛలో, భీష్మ సినిమాలతో వరుసగా తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుముల

By Sumanth Varma k  Published on  8 Nov 2022 6:05 PM IST
హిట్ ఇచ్చిన ఆ డైరెక్ట‌ర్‌తో మ‌రో మూవీకి రెడీ అవుతున్న‌ నితిన్..!

ఛలో, భీష్మ సినిమాలతో వరుసగా తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుముల. ముఖ్యంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మంద‌న్నా హీరోయిన్ గా వచ్చిన భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. అందుకే.. ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని పెంచే దిశగా ఇప్పుడు ఈ టీమ్ మళ్లీ మరోసారి కలిసి పని చేయబోతుంది. తాజాగా వెంకీ కుడుముల నితిన్ ని కలిసి ఓ కథ వినిపించారు. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్ల నితిన్ కూడా సానుకూలంగా ఉన్నాడు.వెంకీ చెప్పిన లైన్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో వెంటనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకు వెళ్ళడానికి నితిన్ సన్నాహాలు చేస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే వెంకీ కుడుముల స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా సినిమా మొత్తం పక్కా కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ఉంటుందని స‌మాచారం. అలాగే ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎనభై నాటి కాలంలో జరుగుతుందని.. ముఖ్యంగా నితిన్ క్యారెక్టర్ ను వెంకీ కుడుముల చాలా బాగా రాశాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది.


Next Story