మోసపోయిన రష్మిక..!
Rashmika Mandanna allegedly cheated of Rs 80 lakh by her manager. భారతదేశంలో అత్యంత బిజీ నటీమణుల్లో రష్మిక మందన్న ఒకరు. అటు బాలీవుడ్ లోనూ
By Medi Samrat
భారతదేశంలో అత్యంత బిజీ నటీమణుల్లో రష్మిక మందన్న ఒకరు. అటు బాలీవుడ్ లోనూ.. ఇటు దక్షిణాది లోనూ వరుసగా సినిమాలు చేస్తూ వెళుతోంది. ఆమె నటిస్తున్న పుష్ప 2: ది రూల్ కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది. తాజాగా రష్మిక మేనేజర్ ఆమెను రూ.80 లక్షలు మోసం చేశారని కథనాలు వస్తున్నాయి. రష్మిక మందన్న తాను మోసపోయానని తెలుసుకుని.. తక్షణమే తన మేనేజర్‌ను తొలగించింది. రష్మిక మేనేజర్ కెరీర్ ప్రారంభం నుండి ఆమెతో కలిసి పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ నివేదికలపై రష్మిక ఇంకా స్పందించలేదు.
పింక్‌విల్లాలో వచ్చిన కథనం ప్రకారం, రష్మిక మేనేజర్ ఆమెను రూ. 80 లక్షలు మోసం చేశాడు. దీన్ని పెద్దదిగా చేయడం రష్మికకు ఇష్టం లేకపోవడంతో తన మేనేజర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అతన్ని అప్పటికప్పుడు తొలగించినా.. ఈ ఘటనపై మాత్రం బయటకు పొక్కకుండా చూసుకుంది రష్మిక. అయితే ఈ మోసం ఎలా జరిగింది అన్నది మాత్రం తెలియలేదు.
ఆమె చేస్తున్న సినిమాలలో యానిమల్ కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానుంది. ఇటు టాలీవుడ్ లో రష్మిక.. పుష్ప ది రూల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో పాటూ నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది.