బాలీవుడ్ బాట పట్టిన రష్మిక.. ఆ హీరోకు హిట్ దక్కేనా

Rashmika In Mission Majnu. రష్మిక మందాన.. ఈ కన్నడ బ్యూటీ కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది

By Medi Samrat  Published on  24 Dec 2020 12:31 PM GMT
బాలీవుడ్ బాట పట్టిన రష్మిక.. ఆ హీరోకు హిట్ దక్కేనా

రష్మిక మందాన.. ఈ కన్నడ బ్యూటీ కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అమ్మడు నటించిన అన్ని సినిమాలు కూడా హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ కు వెళ్లబోతోంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా, డెబ్యూ డైరెక్టర్ శాంతను బాగ్చి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'మిషన్ మజ్ను' సినిమాతో రష్మిక హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ప్రముఖ ప్రొడ్యూసర్ రోని స్క్రూవాలా నిర్మాణంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోంది మిషన్ మజ్ను సినిమా. ఈ సినిమాకు 'ది అన్ టోల్డ్ స్టోరీ అఫ్ ఇండియస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్' అనే ట్యాగ్ లైన్ తో ఆసక్తి రేపుతున్నారు మేకర్స్. రష్మిక మందాన నటించిన అన్ని సినిమాలు కూడా హిట్స్ గా నిలిచాయి. కానీ సిద్ధార్థ్ మల్హోత్రాకు సరైన హిట్స్ లేకుండా ఉన్నాయి. ఈ సినిమా అయినా సిద్ధార్థ్ మల్హోత్రాకు హిట్ అందిస్తుందేమో చూడాలి. రష్మిక ఎంట్రీతో అయినా లక్ కలిసొస్తుందేమో చూడాలి.

తెలుగులో ఇప్పటి వరకూ బబ్లీ క్యారెక్టర్స్ చేసిన రష్మిక త్వరలోనే పుష్ప సినిమాతో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్ లో అలరించనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రానున్న 'పుష్ప' సినిమాలో రష్మిక చిత్తూరు అమ్మాయిగా నటించనుంది. అందుకోసం అక్కడి బాష కూడా నేచుకుంటోంది. ప్రస్తుతం పుష్ప షూటింగ్ దశలో ఉండగానే పలు క్రేజీ ప్రాజెక్టులను అమ్మడు లైన్ లో పెడుతోంది.
Next Story
Share it