పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.!
Ranbir Kapoor On Wedding Plans With Alia Bhatt. బాలీవుడ్ నటులలో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By Medi Samrat Published on 25 Dec 2020 1:00 PM ISTబాలీవుడ్ నటులలో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో కత్రినాకైఫ్ ప్రేమలో ఉన్న రణబీర్ ఆమెతో బ్రేక్ అప్ చేసుకుని.. అలియా భట్ తో ప్రేమలో పడ్డారు. బాలీవుడ్ అందమైన ప్రేమజంటలలో వీరి జంట ఒకటి అని చెప్పవచ్చు. వీరిద్దరూ ప్రేమలో పడినవిషయం తెలిసినప్పటి నుంచి.. వీరి పెళ్లి పై అనేక సార్లు పుకార్లు పుట్టాయి. వీరి పెళ్లి అప్పుడు జరుగుతుందని, ఇప్పుడు జరుగుతుందని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ వార్తలను ఖండిస్తూ వారిద్దరు పెళ్లికి ఇప్పుడే తొందర లేదంటూ తెలియజేశారు.
తాజాగా ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ ఎట్టకేలకు వారి పెళ్లి విషయంపై మనసులోని మాటను తెలియజేశారు. కరోనా మహమ్మారి లేకపోతే ఇప్పటికే వారి పెళ్లి జరిగి ఉండేదని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఇక రణబీర్.. ఈ మధ్య ఆలియాకు దగ్గరగా ఉండేలా ఒక ఫ్లాట్ ను కూడా కొన్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఇక సినిమాల విషయానికొస్తే రణబీర్ కపూర్ ప్రస్తుతం.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో మొదటిసారిగా అలియా భట్ తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ వంటి పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే అలియా భట్ తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ సరసన సీత పాత్ర ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.