ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం రెడ్. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన భారీ విజయంతో ఉన్న రామ్ అదే జోష్‌లో ఈ సినిమా పూర్తి చేశాడు. మరోసారి మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ.. డిఫరెంట్ గెటప్‌లో రంగంలోకి దిగుతున్నాడు. క్రైమ్ థిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. కరోనా రాకుంటే ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈచిత్రం విడుదలై ఉండేది.
సంక్రాంతి కానుకగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే రామ్ ఖాతాలో మరో హిట్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని ఏఎంబీ సినిమాస్ లో ప్రారంభించారు. హీరో రామ్, హీరోయిన్ నివేధా పేతురాజ్, మాళవికా శర్మ, దర్శకుడు కిశోర్ తిరుమల, నిర్మాత స్రవంతి రవికిశోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైగా ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం ఓ విశేషం.