భీమ్లానాయక్ ట్రైలర్‌పై.. రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చూశారా

Ram Gopal Varma Comments On Bheemla Nayak Trailer. ఎవరో ఒక హీరో అభిమానులను గెలకనిదే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు

By Medi Samrat  Published on  22 Feb 2022 12:19 PM IST
భీమ్లానాయక్ ట్రైలర్‌పై.. రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చూశారా

ఎవరో ఒక హీరో అభిమానులను గెలకనిదే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిద్ర పట్టదు. నిద్ర మానుకుని మరీ ట్వీట్లు వేస్తూ ఉంటారు. సోమవారం సాయంత్రం భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే..! పవన్ అభిమానుల దెబ్బకు.. రికార్డులు బద్దలు అవుతూ ఉన్నాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత రామ్ గోపాల్ వర్మ అదే పనిగా పవన్ ఫ్యాన్స్ ను కవ్వించడం మొదలు పెట్టారు.

ట్రైలర్ చూశాక ఈ మూవీ టైటిల్ 'భీమ్లా నాయక్' బదులు 'డానియల్ శేఖర్' అని పెట్టాల్సింది అంటూ వర్మ ట్వీట్ పెట్టారు. ఓ PK ఫ్యాన్‌గా బాగా హర్ట్ అయ్యా అంటూ.. 'భీమ్లా నాయక్' ట్రైలర్ చూశాక రానాను ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్‌ని వాడేసుకున్నారని తెలుస్తోందంటూ మరో కామెంట్ చేశారు. భీమ్లా నాయక్ హిందీ వర్షన్ గురించి మరొక కామెంట్ చేశాడు.. బాహుబలి సినిమా కారణంగా పవన్ కంటే కూడా రానా దగ్గుబాటినే హిందీ ప్రేక్షకులకు తెలుసు. కాబట్టి వాళ్ళు భీమ్లా నాయక్ సినిమాలో రానా హీరో , పవన్ విలన్ అని పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు. పవన్ కి అత్యంత సన్నిహితులైన నిర్మాతలు ఈ విషయంలో ఎలా నిర్లక్ష్యంగా ఉన్నారు, అని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు వర్మ.


మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా ఈ 'భీమ్లా నాయక్' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలుగా పవన్ కళ్యాణ్, రానా నటిస్తూ ఉన్నారు. భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ నటించగా.. డానియ‌ల్ శేఖర్‌గా దగ్గుబాటి రానా కనిపించబోతున్నారు. మాతృకలో లాగా ఇద్దరు హీరోల పేర్లు టైటిల్‌గా తీసుకోకుండా ఒక్క పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు మాత్రమే టైటిల్‌గా పెట్టారు.


Next Story