తన ఫస్ట్ లవర్ ఎవరో చెప్పేసిన వర్మ

Ram Gopal Varma About His First Love. రామ్ గోపాల్ వర్మ తాజాగా తన సీక్రెట్ ను ఫాలోవర్స్ తో పంచుకున్నారు.

By Medi Samrat  Published on  25 Aug 2021 8:52 PM IST
తన ఫస్ట్ లవర్ ఎవరో చెప్పేసిన వర్మ

రామ్ గోపాల్ వర్మ తాజాగా తన సీక్రెట్ ను ఫాలోవర్స్ తో పంచుకున్నారు. తాజాగా తన ఫస్ట్‌ లవర్‌ను పరిచయం చేస్తూ ఆమె ఫొటో షేర్‌ చేశాడు. వర్మ కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆమె పేరు పోలవరపు సత్య అని, ఆమె మెడిసిన్‌ చేసినట్లు తెలిపాడు. విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ రామ్ గోపాల్ వర్మ బిటెక్‌ చదవగా.. అదే క్యాంపస్‌లో సిద్దార్థ మెడికల్‌ కాలేజీలో సత్య మెడిసిన్‌ చేసిందట..! అవి రెండు క్యాంపస్‌లు ఒకేచోట ఉండటంతో రోజు సత్యను చూసేవాడినని, అలా తనతో ప్రేమలో పడిపోయినట్లు చెప్పాడు.

ఆమె డబ్బు ఉన్న మరో వ్యక్తితో ప్రేమలో ఉన్న కారణంగా తనని పట్టించుకునేది కాదనే భావనలో ఉండేవాడినన్నాడు. అలా 'రంగీలా' మూవీ స్టోరీ పుట్టిందని అన్నాడు. అయితే ప్రస్తుతం సత్య అమెరికాలో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తున్నట్లు వర్మ చెప్పాడు. అంతేగాక బీచ్ తీరాన స్విమ్‌సూట్‌లో ఉన్న ఆమె ఫొటోలను తన వరుస ట్వీట్‌లలో షేర్‌ చేశాడు. సత్య సినిమాకు, క్షణక్షణంలో శ్రీదేవి పేరు.. ఆమెను ఊహించుకుని పెట్టినవేనని వర్మ చెప్పుకొచ్చాడు.


Next Story