టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా
Rakul Preeth Singh Tests Corona Positive. కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. చిన్నా-పెద్దా, పేదా-ధనిక అన్న తేడాలు
By Medi Samrat Published on 22 Dec 2020 3:36 PM ISTకరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. చిన్నా-పెద్దా, పేదా-ధనిక అన్న తేడాలు లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. తాజాగా టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
'పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను, ఫీలింగ్ బెటర్.. త్వరలో పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. షూటింగులో పాల్గొంటాను. దయచేసి రీసెంట్‌గా నన్ను కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను'' ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ తెలిపింది. రకుల్ కు కరోనా సోకిందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజగా భారత్‌లో 19,556 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,75,116 కు చేరింది. ఇందులో 96,36,487 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 2,92,518 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 301 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,46,111కి చేరింది.