రజనీకాంత్ అంటే సింప్లిసిటీ.. సినిమాల్లో ఎంత రిచ్ క్యారెక్టర్లతో తలైవా మెప్పించినా బయట మాత్రం చాలా కూల్ గా ఉంటారు. రజనీకాంత్ ఇటీవల ఇండిగో విమానంలోని ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ద్వారా ఎంతో మందిని ఆశ్చర్య పరిచారు. ఆయన విమానంలోకి రాగానే అందులోని వారంతా గట్టిగా కేకలు వేయడం విశేషం.
X లో షేర్ చేసిన వీడియో విమానంలోకి రజనీకాంత్ ఎక్కగానే ప్రయాణికులు స్పందించిన తీరు వైరల్ అయింది. ఆయన్ను గమనించిన వెంటనే ప్రజలు హర్షధ్వానాలు చేస్తూ తమ ఫోన్‌లను తీసి రికార్డ్ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ప్రయాణీకులు చేయి ఊపుతూ 'తలైవా' అని పిలిచారు. రజనీకాంత్ తన అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేశారు.
రజనీకాంత్ 2024లో ఫహద్ ఫాసిల్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి 'వెట్టయన్' చిత్రంలో కనిపించారు. లోకేష్ కనగరాజ్ తో 'కూలీ' సినిమాలోనూ, నెల్సన్ దిలీప్‌కుమార్ 'జైలర్ 2' చిత్రాలలో కనిపించబోతున్నారు.