చేయని తప్పుకు పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై మరణించిన రాజాకన్ను ఫ్యామిలీని తాను ఆదుకుంటానని ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ వెల్లడించారు. రాజాకన్ను భార్యకు పార్వతమ్మకు ఇల్లు కట్టి ఇస్తానని ప్రకటించారు. సూర్య నటించిన 'జై భీమ్' సినిమా ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ సినిమా కథ 28 ఏళ్ల క్రితం జరిగిన ఓ వాస్తవిక ఘటన ఆధారంగా దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా తెరకెక్కించారు. రాజాకన్ను భార్య పార్వతమ్మ చేసిన సాహసంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే విషయమై రాఘవ లారెన్స్ స్పందించారు. బాధితురాలు పార్వతమ్మ పోరాటాన్ని చేసిన పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు.
ఇక దర్శకుడు జ్ఞానవేల్ వాస్తవ ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించారని.. దీనికి ఆయనను మనసారా అభినందిస్తున్నానని తెలిపారు. బాధితురాలు పార్వతమ్మకు మంచి ఇళ్లును నిర్మించి ఇస్తానని అన్నారు. 'జై భీమ్' సినిమా యూనిట్‌కు అభినందలు చెప్పారు. నవంబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జైభీమ్' సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సూర్య, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్, లిజోమోల్ జోసీ, మణికంఠన్ కీలక పాత్రలు పోషించారు. నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకుడు జ్ఞానవేల్ ప్రాణం పోశాడు. లాయర్ చంద్రు పాత్రలో సూర్య నటన అద్భుతమనే చెప్పాలి. ఇక గిరిజన దంపతులుగా మణికందన్, లిజో మోల్ జోసేలు కూడా తమ పాత్రల్లో లీనమైపోయారు.