ఈడీ విచారణకు హాజరైన ద‌ర్శ‌కుడు పూరీ జగన్నాథ్‌

Puri Jagannadh Attends For ED Investigation

By Medi Samrat
Published on : 31 Aug 2021 11:46 AM IST

ఈడీ విచారణకు హాజరైన ద‌ర్శ‌కుడు పూరీ జగన్నాథ్‌

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తొలిరోజు డైరెక్ట‌ర్‌ పూరీ జగన్నాథ్‌ విచారణకు వచ్చారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో పూరీ జగన్నాథ్‌ విచారణకు హాజరయ్యారు. 2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు పూరీ జగన్నాథ్ ను ఆరా తీస్తున్నట్లు సమాచారం. అగ‌స్టు 31న (నేడు) పూరి జ‌గ‌న్నాధ్ విచార‌ణ‌కు హాజ‌రుకాగా.. సెప్టెంబర్ 22 వ‌ర‌కూ మిగ‌తా 11మందిని ఈడీ విచారించ‌నుంది.

సెప్టెంబర్‌ 2: చార్మీ కౌర్‌

సెప్టెంబర్‌ 6: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

సెప్టెంబర్‌ 8: రాణా దగ్గుబాటి

సెప్టెంబర్‌ 9: రవితేజతో పాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌

సెప్టెంబర్‌ 13: నవ్‌దీప్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌

సెప్టెంబర్‌ 15: ముమైత్‌ ఖాన్‌

సెప్టెంబర్‌ 17: తనీష్‌

సెప్టెంబర్‌ 20: నందు

సెప్టెంబర్‌ 22: తరుణ్‌ .. ఇలా ఒక్కొక్కరిని ఒక్కో డేట్ లో అధికారులు విచారించనున్నారు.


Next Story