తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్ కొమర వెంకటేష్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ట్విట్టర్‌లో ప్రకటించింది. జూనియర్ ఆర్టిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఫిలిం ఫెడరేషన్‌కు ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘షేర్’ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. చిత్రపురి కాలనీకి అధ్యక్షుడిగానూ పనిచేశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరిన వెంకటేష్ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.