'అమిగోస్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన అమిగోస్ చిత్రం ఓటీటీ విడుద‌ల తేదీ ఫిక్సైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2023 1:02 PM IST
Nandamuri Kalyan Ram, Amigos OTT Release

అమిగోస్ చిత్రంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన చిత్రం 'అమిగోస్‌'. రాజేంద్ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ క‌థానాయిక‌. క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినంలో నటించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఒకే రూపంలో ఉన్న ముగ్గురు వ్య‌క్తులు క‌లిస్తే ఎలా ఉంటుంద‌నే క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కింది.

జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుద‌ల అవుతుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మార్చి 10న విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఆ రోజున ఓటీటీలో విడుద‌ల కావ‌డం లేద‌ట‌.

ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 1 నుంచి అమిగోస్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్ల‌డించింది. స్లో ఈ చిత్రాన్ని చూడాలంటే అప్ప‌టి వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు.

Next Story