బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.

By -  Medi Samrat
Published on : 3 April 2026 3:51 PM IST

బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని బండ్ల పెళ్లి జరగనుంది. ఈ శుభకార్యానికి ముందు సంప్రదాయం ప్రకారం ఇంట్లో ‘పసుపు కుంకుమ’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సూర్యతేజ చిలుకూరితో జనని వివాహం జరగనుందని బండ్ల గణేష్ తెలిపారు. "శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం" అంటూ బండ్ల గణేష్ ఫోటోలు పోస్టు చేశారు. సినీ ప్రముఖులు, అభిమానులు బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Next Story